Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ పని అప్పుడే అయిపోయింది!.. 'కిరానా హిల్స్' రహస్యాన్ని విప్పిన అంతర్జాతీయ నిపుణుడు!

Tom Cooper Reveals Kirana Hills Secret Pakistan
Advertisement
  • పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి చేసిందని నిపుణుడు టామ్ కూపర్ వెల్లడి
  • ఈ దాడితోనే పాక్ కాల్పుల విరమణ కోసం వేడుకుందని విశ్లేషణ
  • భారత్ మాత్రం ఉగ్ర స్థావరాలపైనే దాడి చేశామని స్పష్టీకరణ
  • అణు స్థావరాలపై దాడిని ఏ దేశం అధికారికంగా అంగీకరించదని నిపుణుల మాట
Advertisement
పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ అణు కేంద్రంపై భారత వాయుసేన రహస్యంగా దాడి చేసిందని, ఆ దెబ్బతోనే ఇస్లామాబాద్ కాల్పుల విరమణ కోసం బతిమలాడిందని ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు టామ్ కూపర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విశ్లేషణ చేశారు. ఈ దాడితో 'మేము ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి దాడినైనా చేయగలం.. ఇక ఆపండి' అనే బలమైన సందేశాన్ని భారత్ పాకిస్థాన్‌కు పంపిందని కూపర్ పేర్కొన్నారు.

తన వాదనకు బలంగా కొన్ని ఆధారాలను కూడా కూపర్ ప్రస్తావించారు. పాక్ పౌరులు తీసిన వీడియోలలో మిసైళ్లు కొండల్లోకి దూసుకెళ్లడం, దట్టమైన పొగలు రావడం స్పష్టంగా కనిపించాయని తెలిపారు. భారత వాయుసేన మొదట రాఫెల్, సుఖోయ్-30 యుద్ధ విమానాలతో పాక్ రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసి, ఆ తర్వాత అణు నిల్వ కేంద్రాల ప్రవేశ ద్వారాలను లక్ష్యంగా చేసుకునిందని వివరించారు. పాకిస్థాన్‌లోని తన వ్యక్తిగత వర్గాలు కూడా ఈ దాడిని ధ్రువీకరించాయని ఆయన అన్నారు.

అయితే, ఈ వాదనలను భారత వాయుసేన (ఐఏఎఫ్) ఖండించింది. ఈ నెల ప్రారంభంలో వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ మాట్లాడుతూ.. భారత్ కేవలం ఉగ్రవాద, సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని స్పష్టం చేశారు. కిరానా హిల్స్‌పై దాడుల వీడియోలు పాకిస్థాన్ సృష్టించినవి కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు, అణు స్థావరాలపై జరిగిన దాడిని ఏ దేశమూ అధికారికంగా అంగీకరించదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉన్నందున, భారత్ 'వ్యూహాత్మక మౌనం' పాటిస్తోందని వారు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భారత ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (S-400) పాక్ డ్రోన్లు, మిసైళ్లను గాలిలోనే కూల్చివేసి తన సత్తా చాటిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
Tom Cooper
Pakistan
Kirana Hills
Indian Air Force
IAF
Nuclear Facility
Air Strike
S-400
Islamabad
Ceasefire

More Telugu News